- మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ శ్రేణులను కోరారు. బుధవారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సండ్ర మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఓటరు నమోదుపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నమోదు ప్రక్రియలో ఏవైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇబ్బందులు ఉన్నవారు నమోదు కేంద్రానికి వచ్చి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కార్యకర్తలు బాధ్యతాయుతంగా మెలగాలన్నారు.
క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అర్హులైన వారందరినీ భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్ మొహమ్మద్ మీర్జా బాషా, నాయకులు మోరంపూడి ప్రభాకర్, షేక్ రఫీ, వీరపనేని బాబీ, అమరవరపు కృష్ణారావు, చాంద్ పాషా, పర్వతనేని వేణు, వల్లభనేని పవన్, గుండ్ర రఘు, మారుతి సూరిబాబు, మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు, జొన్నలగడ్డ విజయ్, గుంజి వెంకటేశ్వరరావు, అక్షింతల చంటి పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)