Magazines

ఎమ్మెల్యేతో నల్గొండ కాంగ్రెస్ నాయకుల భేటీ

1 గంట క్రితం

leaders meet with MLA
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు మంగళవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో భేటీ అయ్యారు. ​సత్తుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు  మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.


​ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఎమ్మెల్యేతో వారు సమాలోచనలు జరిపారు. ​పట్టభద్రుల ఓటర్లను విశేషంగా ఆకట్టుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ సమన్వయం ఉండాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ ప్రచార కార్యక్రమాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి పట్టభద్రుడిని ప్రత్యక్షంగా కలసి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించిన ప్రణాళికలను నల్గొండ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


​ఈ కార్యక్రమంలో  సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు,  నల్గొండ జిల్లా డీసీసీ  జనరల్ సెక్రెటరీ గంగాభవాని, 

సూర్యాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లన్న యాదవ్ నల్గొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్