Magazines

సులభ్ కాంప్లెక్స్‌‌లో మద్యం అమ్మకాలు

2 గంటల క్రితం

Alair Town
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం



బెల్ట్ షాపు అమ్మకాలలో కొత్త కోణం


నవతెలంగాణ ఆలేరు టౌను

సులభ్ కాంప్లెక్స్, మరుగుదొడ్లు, మూత్రశాలల వద్ద మద్యం అమ్మకానికి బెల్ట్ షాప్ విక్రయదారులు శ్రీకారం చుట్టారు. పట్టణంలో మద్యం దుకాణాలే కాకుండా,బెల్టు షాపులలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా మద్యం అమ్మకాలు బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా జరిగాయి.ఆలేర్ పట్టణంలో బుధవారం తెల్లవారుజాము నుండే మరుగుదొడ్ల వద్ద మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి.అక్రమంగా సులబ్ కాంప్లెక్స్ మరుగుదొడ్లు మూత్రశాలల వద్ద మద్యం అమ్మకం జరుగుతుండగా ఎక్సైజ్ పోలీసులు ఖలీల్,నాగేంద్రబాబు ఒక కాటన్ లో మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలోని ఓ వైన్ షాపు నుండి ఈమధ్యం అమ్మకానికి తీసుకువచ్చినట్లు విక్రయదారుడు ఆత్రం మాణిక్ రావు తెలిపారు.కెపిన్ విస్కీ 180ఎంఎల్ 21బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని,టాయిలెట్ల వద్దా అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోద చేసినట్లు ఆలేరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగలాత విలేకరులకు తెలియజేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్