Magazines

పట్టణ వార్డు నూతన అధ్యక్షులు ఎన్నిక 

50 నిమిషాల క్రితం

New urban ward
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ముత్యాల సునీల్ కుమార్ ని భీంగల్ పట్టణ 12 వార్డు ల అధ్యక్షులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించడం జరిగింది. భీంగల్ పట్టణ నూతన వార్డు అధ్యక్షుల పాలకవర్గం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని మోర్తాడ్ ప్రజా నిళయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధ్యక్షులు. అనంతరం ఎన్నికైన అధ్యక్షులకు ముత్యాల సునీల్ కుమార్ అభినందనలు తెలిపి ఇలాంటి భావోద్వేగాలకు చోటు లేకుండా చూసుకోవాలని ఆశించారు.


1వార్డ్ వేముల రాజు 2 వార్డ్ సందు వవన్ 3 వార్డ్ యాదగిరి వంశీకృష్ణ 4 వార్డ్ బైండ్ల మహేష్ 5వ వార్డ్ బింగివారి రాము 6 వార్డ్ మొండి దినేష్ 7వార్డ్ ముద్దం రవి 8 వార్డ్ ఆలకుంట నరేష్ 9వ తీగల రాజు 10 వార్డ్ పత్రి రాజేందర్ 11వార్డ్ సోయాబ్ 12వార్డ్ పోలసాని రంజిత్ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పర్స అనంత రావు, చెప్పాల గణేష్, సర్పంచ్ ఫోరోమ్ అధ్యక్షులు అరిగేలా జనార్దన్, 11వ కౌన్సిలర్ సంగ్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ మమ్మరి సందీప్, మండల అధికార ప్రదినిధి వాక మహేష్, ఉపసర్పంచ్ మంద గోవర్ధన్, ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సేవాలాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్