నవతెలంగాణ - భీంగల్
మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ దావఖానాలో సోమవారం భేటీ జన్మోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ దవఖానాలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులు శిశువుల సంరక్షణకు అవసరమైన భేటీ ప్రోడక్ట్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని, బాల బాలికల పట్ల సమానత్వ భావాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని సూచించారు. సమాజంలో బాలికల పట్ల ఉన్న లింగ వివక్షను రూపుమాపి, ఆడపిల్ల పుట్టడాన్ని ఒక పండుగలా జరుపుకోవాలనే సామాజిక మార్పును తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. వీటిని భీంగల్ మెడికల్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జ్ఞానేశ్వరి, ఏసీడిపిఓ జ్యోతి, సూపర్వైజర్లు విజయ రాణి, శారద, హెల్త్ సూపర్వైజర్స్, వైద్య సిబ్బంది, మహిళా సాధికారత విభాగం జెండర్ స్పెషలిస్ట్ కవిత, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)