నవతెలంగాణ-మద్నూర్
బిచ్కుంద మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అలై బలై కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి మద్నూర్, డోంగ్లి, మండలాల నుండి పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు అక్కడికి తరలి వెళ్లి మాజీ ఎమ్మెల్యేను కలిసి జంబి ఆకులు అందించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ టెంపుల్ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్, మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ధరాస్ సురేష్, చిన్న షక్కర్గా మాజీ సర్పంచ్ షేక్ గఫర్, నాయకులు కృష్ణ పటేల్, సీనియర్ నాయకులు కంచిన్ హనుమాన్లు, సుల్తాన్ పెట్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, మద్నూర్ డోంగ్లి మండలాల బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లి మాజీ ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.







కామెంట్లు (0)