Magazines

అచ్చంపేటలో కనిపించని ప్రతిపక్ష నాయకులు

1 గంట క్రితం

Opposition leaders
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 3 నిమిషాల చదవడం

వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారిన కొందరు నాయకులు..?

నవతెలంగాణ-అచ్చంపేట

నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రజాపాలన ప్రభుత్వం విస్మరిస్తున్నప్పటికీ ప్రజల తరఫున ప్రశ్నించవలసిన ప్రత్యక్ష పార్టీ నాయకులు కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల తరఫున పోరాటం చేయవలసిన ప్రతిపక్ష పార్టీ నాయకులు కనిపించకపోవడంతో అధికార పార్టీ నాయకులు ప్రజల సమస్యలను అభివృద్ధి పనులను విస్మరిస్తున్నారని చర్చ జరుగుతుంది. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లో పదిహేను భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్) పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీ బలంగా ఉన్నది. 


కానీ అధికారం కోల్పోగానే బలహీనపడిందని, కొందరు నాయకులు వారి స్వార్థ కోసం పార్టీ మారారని చర్చించుకుంటున్నారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు బలంగా పనిచేయాలని మీటింగ్‌లలో గొప్పగా మాట్లాడిన నాయకులు ఈరోజు పార్టీ ఓడిపోగానే కార్యకర్తలను కాదని వారి వ్యక్తిగత హోదా, పదవుల కోసం అధికార పార్టీలోకి చేరారని కొందరు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో వీరికి తగిన బుద్ది చెప్పుతామని బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరికి ఒకరు చర్చించుకుంటున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని  ఇందిరమ్మ ఇండ్లలో ప్రభుత్వం సంబరాలు చేసింది.


స్థానిక ఎమ్మెల్యేతో పాటు నాయకులు ఆర్భాటంగా ప్రారంభించారు. వాస్తవానికి చాలామంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చివరి బిల్లు రాలేదు. వీళ్ళ తరుపున ప్రశ్నించే వాళ్లు లేకుండా పోయారని, అదేవిధంగా దీపావళి పండుగకు పింఛన్లు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ అమలుకు నోచుకోలేదు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఎంతగానో ఎదురు చూశారు వీళ్ళ తరపున వీళ్ళ తరపున కూడా ప్రతిపక్షపార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని ఛాయా కోట్టుల దగ్గర ఉదయం, సాయంత్రం ప్రజలు చర్చించుకుంటున్నారు.


 పట్టణంలోని లింగాల రోడ్డు లో అంబేద్కర్ చౌరస్తా నుంచి వెంకటయ్య బిల్డింగ్ వరకు  రోడ్డు వెడల్పు పనులు గత 12 ఏళ్లుగా ప్రారంభించడం లేదు. ఇరుకు రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార దుకాణాల వద్దకు వచ్చిన వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం పైన కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిజెపి,  బి ఆర్ ఎస్ పార్టీ ల ఎందుకు ప్రశ్నించడం లేదని వారిని  ప్రజలు అడుగుతున్నారు.

20 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీలో సిసి రోడ్లకు నోచుకోలేదు

 పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది. కొత్తగా ఏర్పాటు అయిన కాలనీలో సిసి రోడ్లు వేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడిన ఇంద్రానగర్  మహీంద్రా నగర్ కాలనీలలో నేటికీ అంతర్గత రోడ్లు సిసి రోడ్లకు నోచుకోవడం లేదు. వసతులు సౌకర్యాలు లేక కాలనీల ప్రజలు ఇబ్బందులతో జీవనం గడుపుతున్నారు. ఈ సమస్య పైన కూడా ప్రతిపక్ష పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు ఏనాడు పాలకులను ప్రశ్నించడం లేదని కాలనీల ప్రజలు అడుగుతున్నారు.
మినీ ట్యాంక్ బండ్ ఏమైంది

 పట్టణంలో మల్లంకుంటను మినీ ట్యాంక్ బండ్ల ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని గోప్పలు చెప్పారు. ఈ దారిలో సాయి నగర్ కాలనీ ఉంటుంది కుంటకు ఇటువైపు అటువైపు కంచె ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.

ప్రస్తుతం మల్లంకుంట పరిస్థితి అద్వానంగా ఉంది మటన్ చికెన్ చేపలు ఇతర వ్యర్థ పదార్థాలు ఇక్కడ పడేయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. నివాస గృహాల మధ్యన  ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని పైన కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని పట్టణ ప్రజలు అడుగుతున్నారు.
 

 15ఏళ్ళు గా మూతపడిన లెదర్ పార్క్

 నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. మాదిగ చర్మకారులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో జింకుంట స్టేజ్ వద్ద లెదర్ పార్క్ ఏర్పాటు చేశారు. చెప్పుల తయారీ పైన చర్మకారులకు శిక్షణ ఇచ్చారు. పరికరాలు కిట్టు ఇచ్చారు. కానీ పాలకులు,  అధికారుల నిర్లక్ష్యంతో లేదా పార్కు గత 15 ఏళ్లుగా మూత పడింది. చర్మకారులు ఉపాధిని కోల్పోయారు. కోట్ల ప్రజాధనం వృధా ఖర్చు అయిపోయింది. ఈ విషయం పైన కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని, లెదర్ పార్కు వినియోగంలోకి తీసుకురావాలని నిరసనలు వినతి పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని  మాదిగ చర్మకారులు ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్