నవతెలంగాణ-కుభీర్
గ్రామాల్లో ఉన్న పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కుబేర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని మాలేగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చదువులతోపాటు క్రమశిక్షణ క్రీడల్లో నైపుణ్యత పొందేలా కృషి చేయాలని సూచించారు.
పాఠశాలలో చదువుకునే విద్యార్థులు తమ నైపుణ్యత పట్టుదలతో చదివి ఉన్నత స్థాయిని అధిరోహించాల్ని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు వారి ప్రవర్తన, స్నేహితుల ఎంపిక, రోజువారి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల మంచి చెడు అలవాట్లకు దూరంగాసమాజంలో మంచి పేరు తీసుకురాలవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షఖిల్ హైమద్, గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)