Magazines

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

1 గంట క్రితం

Pending issues
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల సుదీర్ఘమైన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండలం ఎడ్లపల్లి మోడల్ స్కూల్లోని ఉపాధ్యాయిని ఈ సందర్భంగా 317 జీవో అమలు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని, 0 1 0 ద్వారా జీతాలను చెల్లించాలని, డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వీటితో పాటు నూతన పిఆర్సీనీ వెంటనే అమలు చేయాలని, టిజిటిలకు నోషనల్ లబ్ది చేకూర్చాలని, పిజిటిలకు జెఎల్ స్కేల్ వర్తింపజేయాలన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ లను విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు ,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్