- ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి..
- ప్రజాస్వామ్యం, చరిత్ర ఎప్పటికీ క్షమించవు..
- ట్విట్టర్ వేదికగా స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
నవతెలంగాణ – మునుగోడు
అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ధర్మబద్ధంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలన జ్ఞానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
సిద్దిపేటలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల అనంతరం రాజగోపాల్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారంలో ఉన్న నాయకులు తమ మాటతీరు, పాలనా విధానంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్న సందేశాన్ని ఆయన తన పోస్టు ద్వారా వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)