Magazines

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలి  

20 నిమిషాల క్రితం

Funds sanctioned
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

- మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. ఈ మేరకు రూపొందించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరికి అందజేశారు.


ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి ఎమ్మెల్యే ఈ ప్రతిపాదనలను మంత్రికి సమర్పించారు.

ప్రతిపాదనల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.35.52 కోట్లు, భగత్‌సింగ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీటి కాలువల నిర్మాణానికి రూ.5.87 కోట్లు, నాలుగు వార్డుల్లో ప్రధాన డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4.33 కోట్లు కేటాయించాలని కోరారు.


అదేవిధంగా పారిశుధ్య నిర్వహణ కోసం జేసీబీ, డోజర్, ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు రూ.2 కోట్లు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు రూ.25 లక్షలు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణానికి రూ.50 లక్షలు, సబ్‌మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్ల ఏర్పాటుకు రూ.25 లక్షల మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీ, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరినట్లు సమాచారం. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్