Magazines

కొత్త పెన్షన్ పత్రాలను అందజేసిన సర్పంచ్‌

10 గంటల క్రితం

pension documents
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

కొత్త పెన్షన్‌ పత్రాలను అర్హులైన లబ్దిదారులకు మంగళవారం సర్పంచ్‌ ఉషా సంతోష్‌ మేస్త్రీ అందజేశారు. ఈ సందర్భంగా మద్నూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న పెన్షనర్‌లకు ఎట్టకేలకు ప్రభుత్వం తీపికబురు చెప్పిందనీ, అర్హులైన వారికి చేయూత పెన్షన్లను మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ పరిధిలోని 125 మందికి కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పంచాయితీ అధికారులు  సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్