Magazines

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు 

3 రోజుల క్రితం

Lord Venkateswara
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తిమ్మాజిపేట

మండల పరిధిలోని పుల్లగిరి గ్రామ పంచాయతీలో గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుల్లగిరి గుట్టపై గుహాలో స్వయంభూగా వెలిసిన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం భక్తులు పూజలుచేశారు. అమ్మవారికి, స్వామివారికి అభిషేక పూజలు చేశారు. పలు గ్రామాల నుండి అయప్ప మాలధారణ చేసిన అయప్ప స్వాములు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అయప్ప స్వాములు హామి ఇచ్చారు. ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న స్వామి వారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. పుల్లగిరి తాండల ప్రజలు ఎక్కువగా స్వామి వారిని భక్తితో కొలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ముడావత్ లోకేష్, భక్తులు హనుమంతు, గోప్య, గోవింద్, పాండు, రాంలాల్, గొల్ల మల్లయ్య, భాస్కర్, శ్రీను, రాజు, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్