Magazines

అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

1 గంట క్రితం

Strict action
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు తప్పనిసరి సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని భీంగల్ ఎస్సై తిరుపతి స్పష్టం చేశారు. దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు.

అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు

సంబంధిత పోలీస్ అధికారుల అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేస్తే ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్-1884, సంబంధిత నిబంధనల ప్రకారం చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.

దుకాణాదారులు తప్పక పాటించాల్సిన నిబంధనలు

టపాకాయల దుకాణాలను అనుమతించిన ఖాళీ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలి. సంబంధిత స్థలానికి అవసరమైన నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ ఓ సి) సమర్పించాలి. ఒక క్లస్టర్ 50 దుకాణాలకు మించి ఏర్పాటు చేయకూడదు. జనారద్ది ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. కల్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో టపాకాయల దుకాణాల ఏర్పాటుకు అనుమతి లేదు. టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్