నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో జరుగుతున్న మరమ్మతుల పనులను సంబంధిత శాఖ టిజిఎం ఎస్ ఐడిఎస్ అధికారి సోమవారం సందర్శించి పనులను పరిశీలించారు. ఆస్పత్రి మరమ్మత్తుల కోసం 30 లక్షల నిధులు మంజూరు అయినట్లు తెలిసింది. ఈ నిధులతో చేపడుతున్న పనులు అధికారి పరిశీలించారు. మరమ్మత్తులు ఏ విధమైన వాటిని చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ తో కలిసి చేపట్టవలసిన పనుల గురించి సూచించారు. అధికారి పరిశీలనలో మరమ్మత్తు పనుల్లో భాగంగా ఆసుపత్రి వైద్యులు కొన్ని సమస్యలు అధికారి దృష్టికి తీసుకువలసినట్లు తెలిసింది. వైద్యుల సూచన మేరకు మరమ్మతులు జరిపిస్తామని అధికారి వైద్యులతో అన్నట్లు కాంట్రాక్టర్కు ఆదేశించినట్లు తెలిసింది. 30 పడకల ప్రభుత్వాసుపత్రిలో మరమ్మత్తు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.







కామెంట్లు (0)