- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య
నవతెలంగాణ - తొగుట
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, పాత విధానం ప్రకారం కొనాలని డిమాండ్ చేశారు. కోతలు కోసి మార్కెట్లో కుప్పలు పోసిన వెంటనే వడ్లను కొని రైతులను ఆదుకోవాలని కోరారు.
డిసిసిబి సొసైటీ, ఐకెపి కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు అమ్మి, తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు అకాల వర్షాలతో వడ్లు నాని కొట్టుకుపోతున్నాయని, మరోవైపు వానలు లేక వరిపంట ఎండిపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఎల్ నినో ప్రభావం ఉందనీ, పంటలు వేయొద్దని చెబుతూ.. రైతును ఆదుకోకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని మండిపడ్డారు. కాలయాపన చేయకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.





కామెంట్‌లు (0)