-కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ బహిరంగ లేఖ
నవతెలంగాణ-మల్హర్ రావు
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండలంలోని కొయ్యుర్ గ్రామ గ్రామ పర్యటనలో భాగంగా దళిత మాల సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచినైన తనను,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అవమానపర్చేలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వారితో కలిసి కార్యక్రమాలు చేసినందుకు బహిరంగ వివరణ కోరుతూ సోమవారం లేక రాసినట్లుగా గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 26న గ్రామపంచాయతీ పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్టు ద్వారా పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన నేపథ్యంలో దళిత మహిళ సర్పంచ్ ని ఆహ్వానించకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా నిలవక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకుల కండువా వేసుకొని మరి ఏ పార్టీ కార్యకర్తలో ఏ పార్టీ నాయకులో తెలువని వారికి మద్దతుగా నిలిచిన వారిని,మిమ్మల్ని ఓడించాలని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలను కొయ్యూరు పర్యటనలో వారిని వెంటబెట్టుకొని కార్యక్రమం చేయడంలో అంతర్యమేమిటన్నారు.తాను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా,కొయ్యూరు గ్రామ మాజీ సర్పంచ్ గా,మండలం మాజీ జెడ్పిటిసి సభ్యురాలిగా,ప్రస్తుత సర్పంచ్ గా పనిచేస్తున్న తనను ఆహ్వానించకపోవడం,కనీస సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు.తాను కాకా వెంకట స్వామి,మంత్రి వివేక్,ఎంపీగా మీ గెలుపు కోసం కష్టపడి పనిచేశామన్నారు.పర్యటనలో తనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు సమాచారం ఇవ్వకపోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నాని,కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మనోభావాలు దెబ్బ తినకుండా బహిరంగ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.







కామెంట్లు (0)