Magazines

తాగు, సాగునీటిని పొదుపుగా వినియోగించాలి: ఎంపీడీఓ

1 గంట క్రితం

Mpdo
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

ప్రతి ఒక్కరు విధిగా నీటి నియంత్రణ చర్యలకు కట్టుబడి ఉండాలని మండల పరిషత్‌ అభివృధ్ధి అధికారి అన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో రాబోయే వేసవికాలంలో తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటి నుంచే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.


నీటిని వృధా చేయొద్దనీ, ఇండ్లు, వాహనాల శుభ్రతకు ప్రత్నామ్నాయ పద్దతులు పాటించాలన్నారు. సాగునీటిని రైతులు అవసరమైన మేర వాడి, వృధాను అరికట్టాలన్నారు. సాధ్యమైన చోట బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి నీటి పొదుపు పద్ధతులను అనుసరించాలన్నారు. నీటి వనరుల సంరక్షణ, చెరువులు, కుంటలు, బావులు, ఇతర నీటి వనరులను కలుషితం చేయకూడదని పేర్కొన్నారు. నీటి లీకేజీలు, పైపుల పగుళ్లు కనిపిస్తే వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేయాలన్నారు. వర్షపు నీరు వృథాగా వెళ్లిపోకుండా ఇళ్లలో, వ్యవసాయ భూముల్లో సాధ్యమైన మేరకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించాలనీ, దీనివల్ల నీరు భూమిలోకి ఇంకి, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని చెప్పారు. ప్రతి కుటుంబం రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించుకోవాలన్నారు. లేనిపక్షంలో రాబోయే ఎండాకాలంలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్