Magazines

విద్యుత్ వైర్లు, స్టార్టర్ బాక్స్ లను ధ్వంసం చేసిన కోతులు

49 నిమిషాల క్రితం

monkeys
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలో వరి పొలాల్లో కోతుల బెడద రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పొట్ట దశలో ఉన్న వరి పంటను కోతుల మంద నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కుంభంపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు ముల్కల్ల రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తన వ్యవసాయ పాలం వద్ద గతంలో కోతులు విద్యుత్ మోటార్ తీగలను ధ్వంసం చేయడంతో వ్యవసాయ మోటార్ కాలిపోయింది. మరమ్మత్తు వీలుకాకపోవడంతో 15 రోజుల క్రితం రూ. 40 వేలు వెచ్చించి కొత్త మోటార్ కొనుగోలు చేశారు.


తాజాగా గుంపులుగా వచ్చిన కోతులు మళ్లీ విద్యుత్ మోటార్ వైర్లు, స్టార్టర్ బాక్స్‌లను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతుకు మరో రూ. 10 వేల మేర నష్టం వాటిల్లింది. తెగిపడి ఉన్న కరెంట్ వైర్లను గమనించకుండా పొలం వద్దకు వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, అటవీ శాఖ ఆధ్వర్యంలో కోతులను పట్టుకొని వేరే ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్