Magazines

యాప్ తో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం

1 గంట క్రితం

secretary App
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 2 నిమిషాల చదవడం

కార్యాలయంలో 36 రికార్డుల నిర్వహణ

నవతెలంగాణ-మల్హర్ రావు

పంచాయతీ కార్యదర్శులపై యాప్ల నిర్వహణ,రికార్డుల నమోదు,గ్రామసభల నిర్వహణ భారం పెరుగుతోంది.ఇప్పటికే వివిధ ప్రభుత్వ పథకాల అమలు,ఇతర విధులతో సతమతమవుతున్న తమకు ఉదయం 9 గంటలకే అటెండెన్స్ నమోదు చేయాలనే నిబంధన మరింత ఒత్తిడికి గురిచేస్తోం దని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఉదయం 11 గంటల వరకు ఉన్న వెసులు బాటును వారం రోజుల క్రితం తిరిగి 9 గంటలకు మార్చడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అటెండెన్స్ విషయంలో కనీసం ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

తరచూ గ్రామసభల నిర్వహణ..

గతంలో ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించే గ్రామ సభలు ప్రస్తుతం వారానికి రెండు నుంచి నాలుగు సార్లు నిర్వహించాల్సి వస్తోందని కార్యదర్శులు అంటున్నారు.జీపీ స్వాప్,జీపీడీపీ,వీబీజీ రామ్ జీ,అంబేడ్కర్ జయంతి,గాంధీ జయంతి,పర్యావర ణం,మహిళా గ్రామసభలు తదితర కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వాటి వివరాలను యాప్లలో నమోదు చేయాల్సి ఉంటోందని చెబుతున్నారు.గ్రామసభల నిర్వహణకు కోరం అవసరమైనప్పటికీ, అధికారుల ఒత్తిడితో సభలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాప్లతో ఉక్కిరిబిక్కిరి..

డీఎస్ఆర్ యాప్ తోపాటు ఇందిరమ్మ ఇళ్ల యాప్,ఎస్బీఎం గ్రామీణ్,జీపీ స్వాప్, జీపీడీపీ,పీఎసీపీ మానిటరింగ్,నిర్ణయ్, మిషన్ భగీరథ,ఎం -యాక్షన్,మేరీ పంచాయతీ,ఐఎఫ్ఎంఐఎస్,చేయూత తదితర యాప్లలో పనులు నమోదు చేయాల్సి వస్తోందని కార్యదర్శులు చెబుతున్నారు.వీటికి అదనంగా గ్రామ స్వరాజ్ ఆన్లైన్ పనులు,చెత్త వేర్వేరు సేకరణ,ట్రాక్టర్ల నిర్వహణ,కార్యాల యంలో 36 రికార్డుల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటోందని పేర్కొంటున్నారు.సర్ ప్రక్రియ,పింఛన్ దరఖాస్తుల స్వీకరణ,ఆన్లైన్ నమోదు,వీబీజీ రామ్ జీ తీర్మానాలు,ఇంకుడు గుంతలు,ఊర కుంటలు, పంట కుంటల లక్ష్యాల సాధన,కుక్కలు, కోతులు,మరుగుదొడ్ల సర్వేలు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలో 15 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

మహిళా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలి..మల్లిఖార్జున రెడ్డి...కార్యదర్శుల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు

మహిళా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఉదయం 10 గంటల వరకు అటెండెన్స్ వేసేలా ప్రభుత్వం ఆలోచించాలి.అటెం డెన్స్ వేయాలనే తొందరలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.పంచాయతీ కార్యదర్శులపై మానవతా దృక్పథం తో ప్రభుత్వం ఆలోచించి 10 గంటలకు అటెం డెన్స్ వేసేలా చర్యలు తీసుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్