- ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు
- అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని తట్టుకునేలా భారీ షెడ్డు
- సింథటిక్ మ్యాట్లతో కబడ్డీ కోర్టు ఏర్పాటు
- మూడు రోజులపాటు సాగనున్న పోటీలు
- ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలో ఉత్సాహంగా రాష్ట్రస్థాయి 73వ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలు బుధవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా డీసీసీబీ, టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు (శుక్రవారం వరకు) స్థానిక వేంసూరు రోడ్డులోని రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్ మైదానంలో జరగనున్న మహిళా కబడ్డీ పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ... సత్తుపల్లి వేదికగా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తూ, క్రీడాకారిణులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ సత్తుపల్లి పట్టణంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం పట్ల విజయబాబును ఎమ్మెల్యే అభినందించారు. ఈ క్రీడా పోటీల ద్వారా సత్తుపల్లి ఖ్యాతి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించాలని, మహిళా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఆకాంక్షించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు
అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారిణులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్వాహకులు భారీ షెడ్డును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్రీడాకారిణుల సౌకర్యార్థం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సింథటిక్ మ్యాట్ కోర్టును ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారిణులకు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పొంగులేటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్, మువ్వా విజయబాబు కబడ్డీ పోటీలు ప్రారంభానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, జిల్లా కార్యదర్శి కటికాల క్రిస్టఫర్ బాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కె.స్వాతిముత్యం, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సి.హెచ్. సుధాకర్, మున్సిపల్ చైర్పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, సత్తుపల్లి పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మొహమ్మద్ కమల్ పాషా, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, గ్రాండ్ మౌలాలి, బండారు శరత్ చంద్ర, జగన్నాథం శ్రీను, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, హాకీం, విరివాడ అపర్ణ, సలీమా బేగం, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), మందపాటి ముత్తారెడ్డి,బొంతు వేణు, కూకలకుంట దయాకర్ (మానస నాని), మందపాటి పద్మజ్యోతి, మొహమ్మద్ షరీఫుద్దీన్, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మువ్వా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)