Magazines

సమాంతర విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌‌ను రద్దు చేయాలి

1 గంట క్రితం

The parallel electricity distribution license should be cancelled.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

హర్యానా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెకు

ఈఈఎఫ్‌ఐ మద్దతు

న్యూఢిల్లీ : సమాంతర లైసెన్స్‌ ‌విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ హర్యానాకు చెందిన విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్లు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సమ్మెకు దిగారు. ఈ నెల 21న రాత్రి 10గంటల సమయంలో ప్రారంభమైన ఈ సమ్మె శనివారం వరకు కొనసా గనుంది. హర్యానా విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల సంయుక్త పోరాట వేదిక నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయి వేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన సమ్మెను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈఈఎఫ్‌ఐ) అభినందించింది. ఈ సమ్మె చారిత్రకమైనదని వ్యాఖ్యానించింది. గురు గ్రామ్‌, నువాల కోసం ఎలెవన్‌ ‌పవర్‌ ‌ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌‌కు 25ఏండ్ల పాటు సమాంతరంగా డిస్ట్రి బ్యూషన్‌ ‌లైసెన్స్‌‌ను మంజూరు చేస్తూ ఈ నెల 19న హర్యానా ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (‌హెచ్‌ఈ ఆర్‌సీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి లైసెన్స్‌ ‌జారీ చేయడం హర్యానాలోనే కాదు మొత్తంగా దేశంలోనే తొలిసారి. తక్షణమే ఈ లైసెన్స్‌‌ను రద్దు చేయాలని, సమాంతర లైసెన్సింగ్‌కు వ్యతిరేకంగా కచ్చితమైన ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలని విద్యుత్‌ ఉద్యోగులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

గతేడాది జూన్‌‌లోనే ఈ కంపెనీని ఏర్పాటు చేసినప్పటికీ ఈ లైసెన్స్‌ ‌పరిధిలోకి 8.3లక్షల మందికి పైగా వినియోగదారులు వస్తున్నారు. ఈ కంపెనీ చెల్లించిన మూలధనం కేవలం కోటి రూపా యిలు మాత్రమే. ప్రభుత్వస్వంత సంస్థలు, రైతులు, ఉద్యోగులు ఇలా అందరూ వ్యక్తంచేస్తున్న అభ్యంత రాలను తోసిపుచ్చుతూ, మైగ్రేషన్‌ ‌ఫ్రేమ్‌‌వర్క్‌, నిలిచిపోయిన వ్యయాలు వంటి అంశాలన్నింటినీ తర్వాత పరిష్కరించడానికి విడిచిపెడుతూ హెచ్‌ఇ ఆర్‌‌సి లైసెన్స్‌‌ను మంజూరు చేసింది. ప్రయివేట్‌ ఆపరేటర్లు ఎక్కువగా చెల్లించే సామర్ధ్యం కలిగిన వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వ వినియోగ సంస్థల ఆదాయంలో అసమానమైన రీతిలో ఆదాయం పక్కకు మళ్ళు తుందని, ఫలితంగా రైతులు,నిరుపేద వినియోగ దారులకు సేవలు సన్నగిల్లుతాయని ఈఈఎఫ్‌ఐ ఆందోళన వ్యక్తం చేసింది. లాభాలన్నీ ప్రయివేటు పరమవుతాయని, సార్వజనీన విద్యుత్‌ ‌సరఫరా భారం ప్రభుత్వ సంస్థలపై పడుతుందని పేర్కొంది. ఇదంతా కూడా ప్రభుత్వ విద్యుత్‌ ‌పంపిణీపై ఒకపద్ధతి ప్రకారం జరుగుతున్న దాడి అని ఇఇఎఫ్‌ఐ విమర్శించింది. ప్రయివేటీకరణ దిశగా ప్రమాదకరమైన చర్య అని వ్యాఖ్యానించింది.

తొలిరోజు దాదాపుగా 55వేల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు సమ్మెలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ 90నుంచి వంద శాతమూ సమ్మె జరిగింది. లైసెన్స్‌‌ను వ్యతిరేకించామని హర్యానా ప్రభుత్వం చెబితే సరిపోదని, ప్రజా ప్రయోజనం కలిగిన అంశాల్లో విధి విధానాలను కమిషన్‌‌కు నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వుందని సమాఖ్య తెలియచేసింది. హర్యానా విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సంఘీభావ కార్యాచరణను ప్రతి రాష్ట్రంలోనూ చేపట్టాలని అన్ని సంఘాలకు ఈఈఎఫ్‌ఐ పిలుపిచ్చింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్