సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
ప్రజల్ని ఢిల్లీకి రాకుండా మోడీ, అమిత్‌షా, మోహన్ భగవత్ అడ్డుకుంటున్నారు
రాంలీలా ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును హరించి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ ఏర్పాట్లను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సీపీఐ(ఎం) నేతలు కలిసి ప్రధాన వేదిక, అనుబంధ వేదికలను సందర్శించారు. వేదికలపై జరుగుతున్న తుదిదశ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ ర్యాలీ ఏర్పాట్ల వివరాలను బృందానికి తెలియజేశారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్. అరుణ్ కుమార్, మరియం ధావలే, కేంద్ర కమిటీ సభ్యులు ఎ.ఆర్.సింధు, విక్రమ్‌సింగ్, ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ తదితరులు సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంఎ బేబీ మాట్లాడుతూ ఆందోళనకారులను ఢిల్లీ నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకు నేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత రాజకీయ భవిష్య త్తులో ఈ ర్యాలీ చరిత్ర సృష్టించనుందని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను కాపా డేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించలేరని స్పష్టం చేశారు. ఇండియా బ్లాక్ పరిధిని దాటి ఈ పోరాటాన్ని విస్తరిస్తామని తెలిపారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకర్తలు కూడా ర్యాలీలో పాల్గొంటారని బేబీ పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)