Magazines

‌మియాపూర్‌ భూమిని కాపాడింది బీఆర్‌ఎస్సే

1 గంట క్రితం

It was the BRS that protected the Miyapur land.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

 మాజీమంత్రి హరీశ్‌‌రావు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

​మియాపూర్‌‌లోని 550 ఎకరాల భూమిని కాపాడింది నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని అమ్ము కుంటామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. మియాపూర్ 550 ఎకరాల భూ వివాదంపై తీర్పు వెలువడిన తర్వాత ముఖ్య మంత్రి రేవంత్‌‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ​మియాపూర్ భూ వివాదం 2003లోనే ఎస్‌ఎల్‌‌పీగా సుప్రీంకోర్టుకు చేరిందని గుర్తు చేశారు. 2013లో అది సివిల్ అప్పీల్‌గా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరిం చారని పేర్కొన్నారు. 2015 లోనే దేశంలోనే అత్యు త్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌‌ను ప్రత్యేకంగా నియమించారని గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయని వివరించారు.

ఆయన 2015 ఏప్రిల్ ఏడు నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున మియా పూర్ భూముల రక్షణ కోసం సుప్రీంకోర్టులో వాదిం చారని తెలిపారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు ఎనిమిదేండ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసిందని పేర్కొ న్నారు. మియాపూర్ తీర్పునకు అసలు పునాది 'ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్' కేసు తీర్పేనని గుర్తు చేశారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబం ధించిన ఆ కేసు 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిం దని తెలిపారు. నాడు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వ మేనని పేర్కొన్నారు. ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పునకు బలమైన ఆధారమయ్యాయని వివరించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి మీడియా సమావేశం వెనుక ఉన్న అసలు కుట్ర వేరే ఉందని ఆరోపించారు. మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ.60 వేల కోట్లపైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని తెలిపారు. ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విలువైన జాతి సంపదను ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించకుండా తెగనమ్ముకునే కుట్రకు తెరలేపారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్