ఏఐ హ్యాకింగ్ టూల్స్‌పై అనుమానాలు
వాషింగ్టన్ : అమెరికా నిఘా సంస్థ సీఐఏ, జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం (ఏడీఎన్‌ఐ) ఉపయోగించే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌పై మంగళవారం భారీ సైబర్ దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ఎలాంటి రహస్య సమాచారం లీక్ కాలేదని అమెరికా అధికారులు తెలిపారు. సీఐఏ, ఏడీఎనఐ సంయుక్తంగా వినియోగించే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోకి హ్యాకర్లు చొరబడ్డారు. ఇది సోషల్ మీడియా, విదేశీ వార్తా పత్రికలు, వాణిజ్య ఉపగ్రహ డేటా సమాచారాన్ని విశ్లేషించే నెట్‌వర్క్. ఇందులో రహస్య లేదా దేశ భద్రతకు సంబంధించిన డేటా ఏమీ లేదని, కేవలం అన్ - క్లాసిఫైడ్ సమాచారం మాత్రమే బహిర్గతమైనదని అధికారులు చెప్పారు. సమస్యను వెంటనే పరిష్కరించామని వారు తెలిపారు.
ఇవి రహస్య పత్రాలు కాకపోయినా అమెరికా నిఘా సంస్థలు ఏయే అంశాలపై, ఏ ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నాయనే సమాచారాన్ని వీటి ద్వారా శత్రు దేశాలు అంచనా వేసే ప్రమాదం ఉన్నదని భద్రతా నిపుణులు అంటున్నారు. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇందులో ఏఐ హ్యాకింగ్ టూల్స్‌ను ఉపయోగించారని అనుమానిస్తున్నారు. ఇటీవల ఎఫ్‌బీఐ, అమెరికా వ్యవసాయ నెట్‌వర్క్‌లపై ఇలాంటి సైబర్ దాడులే జరిగాయి.
ఈ దాడిలో ఉపగ్రహ చిత్రాలు, భౌగోళిక నిఘా సమాచారాన్ని విశ్లేషించే నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌జీఏ) కూడా ప్రభావితమైందని, అలాగే ఇందులో ఆర్టెక్స్ అనే ఏఐ హ్యాకింగ్ టూల్‌తో పాటు చైనా హ్యాకర్ల ప్రమేయం ఉన్నదని ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమయ్యాయి.






కామెంట్‌లు (0)