16 దేశాలపై అదనపు సుంకాలు
జపాన్, ఈయూ కంటే
భారత్‌పైనే అధికం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు మరోసారి భారత ఎగుమతిదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సుంకాల ప్రభావంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్న భారత వాణిజ్య రంగంపై తాజాగా మరింత భారం పడే సూచనలు కనిపిస్తు న్నాయి. పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి, ప్రభుత్వ రాయితీల పేరుతో భారత్ సహా 16 దేశాలపై కొత్తగా దిగుమతి సుంకాలు విధించేం దుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోందని వాల్‌స్ర్టీ ట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ పరిణా మం భారత్-అమెరికా మధ్య కొనసాగు తున్న వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత క్లిష్టంగా మార్చే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ రాయితీలే సాకుగా..
భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం సహా 16 దేశాలు తమ దేశీయ అవస రాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఆయా దేశాల ప్రభు త్వాలు పరిశ్రమలకు రాయితీలు, ఆర్థిక సాయం అందించడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతోందని, దీంతో తక్కువ ధరలకు వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తున్నాయని వాదిస్తోంది. దీంతో అమెరికా కంపెనీలు పోటీలో వెనుకబడుతున్నా యని చెప్తోంది. ఈ అంశంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ నేతృత్వంలో విచారణ కొన సాగుతోంది. 1974నాటి అమెరికా వాణిజ్య చట్టం లోని సెక్షన్301ప్రకారం చర్యలు చేపడుతున్నారు.
భారత్‌పైనే అధిక భారం?
కొత్త సుంకాల విషయంలో దేశాలను బట్టి వేర్వేరు రేట్లు నిర్ణయించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పం దాలు కుదుర్చుకున్న జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై 15 శాతం లేదా అంతకంటే తక్కువ సుంకాలు విధించే అవకాశముంది. భారత్, వియత్నాంపై మాత్రం అంతకంటే ఎక్కువ భారం పడవచ్చని సమాచారం. చైనాపై మరింత కఠినమైన సుంకాలు విధించే అవకాశాలున్నాయి. అయితే తుది సుంకాల రేట్లను ఇంకా ప్రకటించలేదు. అధిక ఉత్పత్తిని కొనసాగిస్తే భవిష్యత్తులో సుంకాలను మరింత పెంచే విధానాన్ని కూడా అమెరికా పరిశీలిస్తోంది. కొత్త సుంకాల విధానాన్ని అమెరికా రూపొందిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం ఖరారుకు మరింత జాప్యం జరగొచ్చు. చర్చలు చివరి దశకు చేరాయని ఇదే నెలలో భారత వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రకటించినప్పటికీ.. అమెరికా కొత్త సుంకాల విధానం స్పష్టమయ్యే వరకు ఒప్పందంపై సంతకాలు సాధ్యం కాదని తేల్చిచెప్పారు.






కామెంట్‌లు (0)