మోడీ హయాంలో విస్తరించిన భారత్, ఇజ్రాయిల్ ‘రక్షణ’ సంబంధాలు
కీలక పాత్ర పోషిస్తున్న అదానీ గ్రూప్
ఇజ్రాయిల్ సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో పెట్టుబడులు
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమాన్ని ఖండించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఆయన తరచూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇజ్రాయిల్‌పై మీ వైఖరి ఏమిటని గత వారం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాహుల్ గాంధీని విలేకరులు ప్రశ్నించగా ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమాన్ని మరోసారి ఖండించారు. అయితే ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘ఇజ్రాయిల్‌తో బలమైన సంబంధాలు నెరపేందుకు నేను మద్దతు ఇస్తాను. సాయుధ దళాల కోసం అత్యుత్తమ ఆయుధాలను కొనుగోలు చేయడం సహా మనకు వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి’ అని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మిత్ర పక్షాలు, వామపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదంగానే ఉన్నప్పటికీ భారత్, ఇజ్రాయిల్ దేశాలు కీలకంగా భావించే వ్యూహాత్మక భాగస్వామ్య లోతును అవి ప్రతిబింబి స్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
తయారీ - సరఫరాల కేంద్రంగా భారత్
గూఢచర్యం, సరిహద్దుల నిర్వహణ, అసమ్మతి గళాల అణచివేత వంటి విషయాలలో ఇజ్రాయిల్ అనుసరిస్తున్న పద్ధతులను భారత్ పరిశీలిస్తూ ఉంటుందని పరిశోధకుడు, రచయిత ఆజాద్ ఎస్సా తెలిపారు. మన దేశంలో రైతులు సహా భారతీయులకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఉత్పత్తులు, పద్ధతులను వాడడం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్ కంపెనీలకు భారత్ ఓ తయారీ, సరఫరా కేంద్రంగా మారు తోందని వ్యాఖ్యానించారు. ‘మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్’ ముసుగులో నిర్మించిన ఇజ్రాయిల్ సైనిక మౌలిక సదుపా యాలలో భారత్ పెట్టుబడి కలిసిపోయిందని, ఇందుకు హైదరా బాదులోని డ్రోన్ల తయారీ ప్రాజెక్టే ఉదాహరణ అని మరో పరిశోధకుడు అశుతోష్ సింగ్ తెలిపారు. హైదరాబాదులో చాలా వరకూ జరిగేది ఇజ్రాయిల్ డ్రోన్ల అసెంబ్లింగేనని నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ నికొలస్ బ్లారెల్ స్పష్టం చేశారు. గాజాలో ఇజ్రాయిల్ జరిపిన పోరులో ఈ డ్రోన్లను కూడా ఉపయోగించారని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ పోలీసు, సైనిక వ్యూహాలను అనుసరించేందుకు హర్యానా రాష్ట్రం సైతం ఆరేండ్ల పాటు పాటు ప్రయత్నించింది. 2024 ఫిబ్రవరిలో రాజధాని ఢిల్లీ వైపుగా కవాతు చేస్తున్న రైతులపై ఆ రాష్ట్ర పోలీసులు డ్రోన్లతో భాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఆ దేశం రక్షణ సాంకేతికతల వాల్‌మార్ట్
జూలై 30న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రచురించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం...2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2025 నవంబర్ 30 వరకూ భారత సంస్థల నుంచి ఇజ్రా యిల్‌కు 2,596 ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక విడిభాగాలు రవాణా అయ్యాయి. ఈ నివేదికలో తొమ్మిది కంపె నీల పేర్లు ఉండగా వాటిలో మూడు పూర్తిగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవే. భారత్, ఇజ్రాయిల్ సంబంధాలలో రక్షణ రంగమే కీలకం. ‘ఇజ్రాయిల్ దేశం రక్షణ సాంకేతికతల వాల్‌మార్ట్ లాంటిది. ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుం డానే నేరుగా వెళ్లి వాటిని కొనుగోలు చేయవచ్చు. ఆ సాంకేతి కతలను ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు’ అని రక్షణ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. పాక్‌తో సరిహద్దు వెంబడి భారత్ మోహ రించింది ఇజ్రాయిల్ డ్రోన్లేనని ఆయన గుర్తుచేశారు. భారత్ అణు పరీక్షలు జరిపిన తర్వాత ఇతర దేశాల సరఫరాదారులు ఆంక్షలు విధించినప్పటికీ ఇజ్రాయిల్ నుంచి విడిభాగాలు, మందుగుండు సామగ్రి సరఫరా అవుతూనే ఉన్నాయి. కొన్ని రకాల సాంకేతికతల సరఫరాకు పశ్చిమ దేశాలు వెనుకాడి నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం వాటిని కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ ఆయుధాలు, సాంకేతికతలపై భారత్ ఆధారపడడం మోడీతో మొదలు కాలేదు. కాకపోతే ఆయన హయాంలో ఆ భాగస్వామ్యం బాగా విస్తరించింది. గతంలో భారత ప్రభుత్వాలు రహస్యంగా ఇజ్రాయిల్ ఆయుధాలను కొనుగోలు చేసేవి. ఇప్పుడు అదంతా బాహాటంగానే జరుగుతోంది.
ఆయుధాల నుంచి హ్యాకింగ్ వరకూ...
మోడీ హయాంలో భారత్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు బాగా విస్తరించాయి. ఆయుధాలు, నిఘా వ్యవస్థలు మొదలుకొని పోలీసింగ్, హ్యాకింగ్ వరకూ ఇజ్రాయిల్‌ను మన దేశం కీలక భాగస్వామిగా భావిస్తోంది. దాని సాంకేతికతలు, నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇజ్రాయిల్ నుంచి ఫోన్- హ్యాకింగ్ సాంకేతికతను కొనుగోలు చేయడానికి నిబంధనలను సడలించారని స్వచ్ఛంద సంస్థ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) తన పరిశోధనలో తేల్చింది. ఇజ్రాయిల్ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్‌ను భారతీయ పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిన సంగతి తెలిసిందే. పాత్రికేయులు సిద్ధార్ధ్ వరదరాజన్, ఆనంగ్ మంగ్నాలేల ఫోన్లకు వైరస్ వ్యాపించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. ఈ ఉదంతాలన్నీ ఓ రకమైన పరాధీనతను సూచిస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.
కేంద్ర బిందువుగా
అదానీ గ్రూప్
2014 నుంచి ఇజ్రాయిల్ జరుపుతున్న ఎగుమతుల్లో భారత్ వాటా 37 శాతంగా ఉంటోంది. ఇజ్రాయిల్ అత్యంత విశ్వసనీయ ఆయుధ కొనుగోలు దారుగా మన దేశం నిలిచింది. మోడీకి అత్యంత సన్నిహితుడైన బిలయనీర్ గౌతమ్ అదానీ నేత త్వంలోని అదానీ గ్రూప్ ఈ సంబంధాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇజ్రాయిల్ వెలుపల మొట్టమొదటి సారిగా హైదరాబాదులో హెర్మెస్ 900 తరహా డ్రోన్లను ఉత్పత్తి చేయడానికి ఇజ్రాయిల్ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్‌తో అదానీ గ్రూప్ 2016లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఆయుధ పరిశ్రమతో కలిసి నెగెవ్ మిషన్ గన్స్ విడిభాగాలను తయారు చేసే బీఎలఆర్ సిస్టమ్స్‌లో అదానీ గ్రూప్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. అదానీ గ్రూప్, ఇజ్రాయిల్ గాడోస్ సంస్థ కలిసి 2023 జనవరిలో 1.15 మిలియన్ డాలర్లకు హైఫా ఓడరేవును కొనుగోలు చేశాయి. ఈ కార్యక్రమానికి అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హాజరయ్యారు కూడా.






కామెంట్లు (0)