Magazines

ఇరాన్ యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలి

11 నిమిషాల క్రితం

immediate end.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

షరతులు అంగీకారయోగ్యం కాకపోయినా తప్పదు

మెజారిటీ అమెరికా ఓటర్ల మనోగతం ఇదే

వాషింగ్టన్ : ఇరాన్‌తో జరుపుతున్న యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని అమెరికాలోని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ విధించే షరతులు అంగీకారయోగ్యం కాకపోయినా, ప్రతికూలంగా ఉన్నా సరే తప్పదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, పరిశోధనా సంస్థ ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన ‘క్రిటికల్ ఇష్యూస్ పోల్‌’ గణాంకాలను మంగళవారం విడుదల చేశారు. షరతులతో నిమిత్తం లేకుండా యుద్ధాన్ని తక్షణమే ముగించాల్సిందేనని 55 శాతం మంది తేల్చి చెప్పారు. డెమొక్రాట్లలో 80 శాతం మంది, స్వతంత్ర ఓటర్లలో 59 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రిపబ్లికన్లలో మాత్రం 25 శాతం మందే ఈ వాదనను సమర్ధించారు.

ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చేపట్టే చర్యలకు మెజారిటీ డెమొక్రాట్ ఓటర్లు మద్దతు తెలిపారు. సైనిక కార్యకలాపాల కోసం నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకోవాలని 53 శాతం మంది, రాబోయే బడ్జెట్‌లో ఇరాన్ యుద్ధానికి నిధుల కేటాయింపును నిలిపివేయాలని 51 శాతం మంది డెమొక్రాట్లు సూచించారు. ఈ చర్యల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయినా...అంటే షట్‌డౌన్ అయినా సరే సిద్ధమేనని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి ప్రజలు ఏయే షరతులకు అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారనేది తెలియడం లేదని సర్వేకు ప్రధాన పరిశోధకుడిగా వ్యవహరించిన షిబ్లీ తెల్హామీ చెప్పారు. కాగా ఇరాన్ యుద్ధాన్ని 21 శాతం మంది సమర్ధిస్తుండగా ఉద్రిక్తతల పెంపుదలకు 18 శాతం మంది మద్దతు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్