Magazines

బంగ్లాదేశ్ లో వస్త్ర కార్మికులపై పోలీసుల వీరంగం

11 నిమిషాల క్రితం

Police rampage against garment workers in Bangladesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

డిమాండ్లు అమలు చేసేదాకా ఆందోళనలు : సంఘాల నేతలు

బాష్పవాయుగోళాలు..లాఠీలతో విరుచుకుపడిన బలగాలు

ఢాకా : బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డెక్కారు. కాగా దశాబ్ద కాలంలో ఇదే అతి తక్కువ శాతం వేతన పెంపుదల కావడంతో ఢాకా శివార్లలో ఉన్న గాజీపూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం అక్కడి ప్రభుత్వం దిగి వచ్చింది. కార్మికులకు కనీస నెలసరి వేతనాన్ని 36 శాతం మేర పెంచి 139 డాలర్లుగా (17,000 టాకాలు) ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన వేతన బోర్డు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వారాల తరబడి సాగిన నిరసనలు, ఫ్యాక్టరీల మూసివేత నేపథ్యంలో కార్మిక సంఘాలు, యజమానుల మధ్య సుమారు 12 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అనంతరం వేతన పెంపుపై నిర్ణయం వెలువడింది. పెంచిన వేతనాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి అవి వారి చేతికి అందుతాయి. ఆరుగురు సభ్యుల బోర్డులో వేతన పెంపుదలను నలుగురు సమర్ధించగా ఇద్దరు వ్యతిరేకించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా కనీస వేతనాన్ని 32,000 టాకాలకు పెంచా లని కార్మికులు అక్టోబర్ నుంచి ఆందోళన బాటపట్టారు.

ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపు ప్రకటనకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్ని నిరసనలకు పిలుపు నిచ్చాయి. తమ డిమాండ్లు అమలు చేసే దాకా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. యజమా న్యాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం పోలీసులను రంగం లోకి దింపింది. కార్మికులపై భాష్ప వాయుగోళాలను ప్రయోగించింది. లాఠీలతో విరుచుకు పడింది. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారా యి. మరోవైపు ఈ నిరసనల కారణంగా వస్త్ర పరిశ్రమ ఇప్పటికే సుమారు 428 మిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని అధికార వర్గాలు తెలిపాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్