ఏడు జిల్లా పరిషత్, 50 పంచాయతీ సమితి స్థానాల్లో విజయం
బీజేపీకి ఎదురుదెబ్బ..37 జిల్లా పరిషత్‌లలో ఐదింటికే మెజారిటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజస్తాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో సీపీఐ(ఎం) పలు స్థానాల్లో విజయం సాధిం చింది. పంచాయతీ సమితుల్లో 50 స్థానాలు, జిల్లా పరిషత్‌లలో ఆరు స్థానాలను గెలుచు కుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,275 జిల్లా పరిషత్ స్థానాలకు, 7,543 పంచాయతీ సమితి స్థానాల కు ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాష్ట్ర ఎన్ని కల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం... జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 686 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 318 స్థానాలకే పరిమితమైం ది. ఆర్ఎల్పీ 42, బీఏపీ 22 స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ(ఎం) ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. పంచాయతీ సమితి ఎన్నికల్లో కాంగ్రెస్ 3,733 స్థానాలతో ముందంజలో నిలిచింది. బీజేపీ 2,210 స్థానాలు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) 496, భారత ఆదివాసీ పార్టీ (బీఏపీ) 276, బీఎస్పీ 60 స్థానాలు సాధించాయి. సీపీఐ(ఎం) 50 స్థానాలు కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 627 స్థానాల్లో విజయం సాధించారు.
హనుమాన్‌గఢ్ జిల్లాలోని భాద్రా, రాజ్పూర్ పంచాయతీ సమితులను సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. భాద్రాలో మొత్తం 19 స్థానాలకు గాను 15 స్థానాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మూడు, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. రాజ్పూర్లోనూ 19 స్థానాలకు గాను సీపీఐ(ఎం) 14 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ నాలుగు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దోడ్ గ్రామీణ పంచాయతీలో సీపీఐ(ఎం) ఆరు స్థానాలు గెలుచుకుంది. దోడ్, హనుమాన్‌గఢ్ జంక్షన్, హనుమాన్‌గఢ్ టౌన్, నోహర్ రీడ్డి పంచాయతీల్లో రెండేసి స్థానాల్లో విజయం సాధించింది. పల్లూ, కచరియావాస్, నీంకా థానా, తారానగర్, శ్రీడూంగర్గఢ్ పంచాయతీల్లోనూ ఖాతా తెరిచింది. భాద్రా పంచాయతీ సమితి పరిధిలో సీపీఐ(ఎం)కు దాదాపు 40 వేల ఓట్లు లభించాయి. రాజ్‌పూర్‌లో సుమారు 38 వేల ఓట్లు సాధించింది.
హనుమాన్‌గఢ్‌లో నాలుగు జిల్లా పరిషత్ స్థానాలు
హనుమాన్‌గఢ్ జిల్లాలో సీపీఐ(ఎం) నాలుగు జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకుంది. ఈ జిల్లాలో పార్టీ అభ్యర్థులకు దాదాపు లక్ష ఓట్లు లభించాయి. బికనీర్, సికర్ జిల్లాల్లో ఒక్కో స్థానంలో విజయం సాధించింది. చురు జిల్లాలోనూ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. చురు జిల్లాలో సీపీఐ(ఎం) జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీపీఐ(ఎం) కీలక విజయం సాధించింది. బికనీర్ జిల్లాలోని నోఖా నగరపాలికలో మొత్తం 45 వార్డులకు గాను 29 వార్డులను గెలుచుకుని పాలక మండలి ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 40 స్థానాల్లో విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు స్థానిక ప్రజా సమస్యలపై నిర్వహించిన పోరాటాలకు లభించిన ప్రజా మద్దతుగా సీపీఐ(ఎం) నాయకత్వం పేర్కొంది.
బీజేపీకి ఎదురుదెబ్బ
రాజస్తాన్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 37 జిల్లా పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో ఐదు చోట్ల మాత్రమే మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 20 జిల్లా పరిషత్‌లలో మెజారిటీ దక్కించుకుంది. హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఒక జిల్లా పరిషత్‌లో అధికారాన్ని దక్కించుకునే స్థాయికి చేరింది. మరో 11 జిల్లా పరిషత్‌లలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. వీటిలో నాలుగు చోట్ల కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ ఒకటి, బీఏపీ రెండు జిల్లా పరిషత్‌లలో అతిపెద్ద పార్టీగా అవతరించాయి. నాలుగు జిల్లా పరిషత్‌లలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకం కానుంది.







కామెంట్లు (0)