అటు రష్యా నుంచి డీజిల్..ఇటు భారత్
లోనూ రిలయన్స్ తో సంప్రదింపులు
వచ్చేవారంలో అమెరికా విదేశాంగ
మంత్రి రూబియో పర్యటన
న్యూఢిల్లీ : వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు, వాణిజ్య పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఇంధన సహకారంపై చర్చించేందుకు 17 నుంచి 22వ తేదీ వరకు భారత్, ఉజ్బెకిస్తాన్ల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కొ రూబియో పర్యటించనున్నారు. వాస్తవానికి చమురు కోసం అమెరికా తంటాలు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే రష్యా నుంచి డీజిల్ కోసం ట్రంప్ డీల్ చేస్తుండగా..మరోవైపు ఆసియా దేశాల్లోని చమురు కోసం అమెరికా రూట్ ప్లాట్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా తొలుత ఉజ్బెకిస్తాన్లో పర్యటించిన తర్వాత భారత్ రానున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన ముంబయి, జామ్నగర్ల్లో పర్యటిస్తారు. జామ్ నగర్లోని రిలయన్స్ రిఫైనరీని సందర్శిస్తారని భావిస్తున్నారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు సీనియర్ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. వ్యాపార,వాణిజ్య వర్గాల నేతలతోకూడా ఆయన సమావేశం కానున్నారు. మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపటించినట్లుగా టెక్సాస్లోని బ్రౌన్విల్లెలో 30వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయతలపెట్టిన చమురు రిఫైనరీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతుందనే ప్రణాళికల నేపథ్యంలో రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో రూబియో వెంట 200మంది వాణిజ్య నేతలతోకూడిన వాణిజ్య ప్రతినిధి వర్గ బృందం వుంది. అమెరికా, సెంట్రల్ ఆసియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టపరచడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా వుంది.





కామెంట్లు (0)