Magazines

బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

1 గంట క్రితం

bottle cap
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -ఊట్కూర్ ​
పెద్దల చిన్నపాటి నిర్లక్ష్యం.. బాలుడి ప్రాణం తీసింది. ఆడుకునే సమయంలో తొమ్మిది నెలల బాలుడు వాటర్‌ ‌బాటిల్‌ ‌మూత నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుని ప్రాణం కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ వీధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవినగర్ వీధికి చెందిన గాయత్రి- లక్ష్మణ్ దంపతుల కుమారుడు ఆర్యవర్ధన్(9నెలలు). ఈనెల 12వ తేదీన ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో వాటర్‌ ‌బాటిల్‌ ‌మూతను నోట్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు ఆ మూత గొంతులో ఇరుక్కోవడంతో బాలుడు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించినప్పటికీ బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఆర్యవర్ధన్ మృతిచెందాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్