కోల్‌కతా తొక్కిసలాట ఘటనపై పోలీసుల వెల్లడి
ఏడుగురు అరెస్టు..19 చేరిన మృతుల సంఖ్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతాలోని చార్బగాన్ సర్వజనీన్ దుర్గా మండపం వద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్లక్ష్యం, నిర్వహణాలోపాలే ప్రధాన కారణమని పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. మరోవైపు మృతుల సంఖ్య 19 కి చేరింది. ఇంకా 25 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూజా నిర్వాహకుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షం తర్వాత జన సమూహాన్ని నియంత్రిం చడంలో దుర్గా పూజ మండపం నిర్వాహకులు విఫలమ య్యారని, అలాగే తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం వంటివి సందర్శకులలో భయాం దోళనలను రేకెత్తించాయని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఆ అధికారి పేర్కొన్నారు. పూజా నిర్వాహకుల ఘోరమైన నిర్లక్ష్యానికి సంబంధించి తాము తగినన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. సిసిటివి కెమెరా ఫుటేజీని సేకరించి, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసి ఈ విషయాన్ని నిర్ధరించుకున్నామని వెల్లడించారు.
క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా
మరోవైపు, కోల్‌కతా దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల పరిహారంతో పాటు, కుటుంబం లోని ఒకరికి 'గ్రూప్-డీ' స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అలాగే ఈ తొక్కిసలాట ఘట నపై దర్యాప్తు చేసేందుకు కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర దిగ్భ్రాంతి
కోల్‌కతాలోని చార్బగన్ దుర్గామండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండే కోల్‌కతా వైద్య కళాశాల ఆసుపత్రికి కాకుండా ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించడాన్ని సీపీఐ(ఎం) ఆక్షేపించింది. ప్రయివేటు ఆస్పత్రికి ప్రచార కార్యకర్తగా బీజేపీ ప్రభుత్వ వ్యవహరించడం సిగ్గు చేటు అని, ఇప్పుడు బాధితులకు ఎంతటి సానుభూతి ప్రకటిం చినా..లేదా పరిహారం అందించాని ఆ నష్టాన్ని భర్తీ చేయలేరని పేర్కొంది.దుర్గమ్మ మండపాల వద్ద సందర్శకుల భద్రతను పటిష్టం చేయడానికి కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేయకుండా..ఆ మండపాల పూజా కమిటీలను గుప్పె ట్లో పెట్టుకోవడానికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ చూపిందని విమర్శించింది. ఈ ఘటనకు కారణమైన దుండగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
కాగా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా నగరంలో మండపాలకు సమీపంలో పుస్తకాల దుకాణాలు ఏర్పాటు చేయడం విక్రయించడం కొల్కతా సంస్కృతిలో సాంప్రదా యంగా వస్తోంది. బిజెపి పాలకులు ఇప్పుడు ఆ పుస్తకాల దుకాణాలను కూడా కూల్చివేసి దుర్మార్గం చాటారు. ఈ చర్యలను కూడా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. సాధారణంగా సుదూర ప్రాంతాల నుంచి మండపాల సందర్శనకు వచ్చే ప్రజల భద్రతకు ఏర్పాట్లు చేసి అక్కడే మోహరిం చాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా ప్రగతిశీల పుస్తకాల దుకాణా లను అడ్డుకకోవడంలోనూ, కూల్చివేసే చర్యల్లోనూ నిమగ్నమవ్వడం దుర్మార్గ మని తెలిపింది. అంతేకాదు పౌర సమాజాలు, విపత్తు నివారణ సహా యక బృందాలతో కలిసి ప్రజలకు సేవలం దించాల్సిన పోలీసులు..పాలక పెద్దలకు, వీవీఐపీల కు, వారి అనుచరుల సేవలో తరిస్తున్నారని విమర్శించింది. తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన అధికా రులను బాధ్యులుగా చేయాలని, జవాబు దారీతనం నెలకొల్పడానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
నిర్వాహక కమిటీలోకి చొరబడ్డ అధికారిక పెద్దలు
సాధారణంగా దుర్గా మండపాల వద్ద పూజా నిర్వాహకులు ప్రతి మండపాన్ని ప్రత్యేక కాన్సెప్టుతోనూ, థీమ్‌తో రూపొందిస్తారు. ఇందుకు సంబంధించిన వనరులను సమీకరించి.. విజయవంతం చేయడానికి ఏడాది పొడవునా అదే పనుల్లో నిమగ్నమైవుంటారు. తొక్కిసలాట జరిగిన మండపం వద్ద కూడా ఇలాగే చేసేవారు..కానీ అధికార బీజేపీ పెద్దలు ఈ పూజా కమిటీలోకి బలవం తంగా చొరబడ్డారు. ఈ ఏడాది జులై మధ్యలో ఈ మండపం మునుపటి నిర్వాహకులను కాదని.. ప్రభుత్వ పెద్దలే పూజా కమిటీలో తమ వారిని నియమించుకున్నారు. అందువల్లే జన సమూహ నిర్వహణకు సరైన ప్రణాళిక లేకపో వడం, ప్రామా ణిక పద్ధతులు కొరవడటం వంటివి ఇటువంటి విషాదకరమైన అవాంఛనీయ ఘటనలకు దారితీ శాయని సీపీఐ(ఎం) పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పిదాలను సరిచేసుకోవాలని హితవు పలికింది.






కామెంట్లు (0)