అంకితా భండారీ తల్లిదండ్రులు, కాంగ్రెస్ నేతల అరెస్ట్ కొన్నిగంటలయ్యాక రిలీజ్ సిక్కిం గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియామకాన్ని నిలిపివేయాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్కు చెందిన రిసెస్షనిస్టు అంకితా భండారీ హత్య కేసులో న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టిన ఆమె తల్లిదండ్రులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిక్కిం గవర్నర్గా బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ నియా మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అంకితా తల్లిదండ్రులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. నిరసనలు చేస్తున్న సమయంలో అంకితా తల్లిదండ్రులను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలిశారు. అంకితా భండారీ కేసులో కేంద్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన నియామకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నిరసన సంద ర్భంగా అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతలు పవన్ ఖేడా, జోతిమణి, ఇమ్రాన్ ప్రతాప్గఢీ పోలీస్ స్టేషన్లోనే ఆందోళన చేపట్టారు. అంకితా కుటుంబానికి న్యాయం చేయాలని కోరు తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని వారు తప్పుబట్టారు.






కామెంట్లు (0)