- ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేస్తున్న మోడీ సర్కార్
- నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు కోసం పోరాటం:
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ
- పోలీసుల ఆంక్షలే సామాన్యుల దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి
- ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకే కేంద్రం, ఢిల్లీ పోలీసుల కుట్ర :
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఐషీ ఘోష్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జంతర్‌మంతర్‌ను మూసివేస్తే దేశవ్యాప్తంగా వందలాది జంతర్‌మంతర్లు పుట్టుకొస్తాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ హెచ్చరించారు. ఆందోళనలను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఇప్పటికే ఢిల్లీని బారికేడ్ల నగరంగా మార్చేశారని, వేల సంఖ్యలో కేంద్ర బలగాలు, పోలీసులను మోహరించారని తెలిపారు. శనివారం జంతర్‌మంతర్‌లో జరిగే ఆందోళనలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులంతా పాల్గొంటారని వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఎం.ఎ. బేబీ మీడియాతో మాట్లాడారు.ఈ ఆందోళనలో ప్రభుత్వం తమను అరెస్టు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమలో చాలామంది పలుమార్లు అరెస్టయ్యారని గుర్తు చేశారు. ఒకవేళ నాయకులను అరెస్టు చేసినా వారి స్థానంలో వందలాది మంది ఉద్యమకారులు ముందుకొస్తారని తెలిపారు. నిరసనలను అణచివేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఎప్పటికీ కాపాడగలమని మోడీ, అమిత్ షా భావించవద్దని హెచ్చరించారు.
నిరసన హక్కు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాం
ఢిల్లీలో సామాన్య ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా, నిరసన తెలిపే హక్కు కోసమే సీపీఐ(ఎం) సుప్రీంకోర్టును ఆశ్రయించిందని బేబీ తెలిపారు. పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు పాక్షిక ఉపశమనం కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒకచోట సమావేశమయ్యే అవకాశాలను దెబ్బతీయడంతో ప్రయత్నిస్తోందని విమర్శించారు. అదే సమయంలో కఠినమైన ఆంక్షలు, నిషేధాలు విధించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తద్వారా నిరసనలపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు కోసం సీపీఐ(ఎం) పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
నేటి ఆందోళనలో కేంద్ర కమిటీ సభ్యులు
ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, విశ్వసనీయతను దెబ్బతీసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నేడు జంతర్‌మంతర్‌లో జరిగే ఆందోళనలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని బేబీ తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికే సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కొనసాగే కేంద్ర కమిటీ సమావేశంలో సమకాలీన రాజకీయ పరిణామాలు, సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన తదుపరి ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
యువతలో తీవ్ర అసంతృప్తి: ఐషీ ఘోష్
శాంతియుత నిరసనలను అణచివేసేందుకు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఐషీ ఘోష్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున నిర్బంధిస్తున్నారని విమర్శించారు. సంఘాల కార్యాలయాల్లోకి పోలీసులు చొరబడ్డారని, రైళ్లను భారీగా రద్దు చేశారని, మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఢిల్లీకి వచ్చే ప్రయాణికుల వివరాలను విమానాశ్రయాల్లో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వస్తున్న పలువురు విద్యార్థులను మార్గమధ్యంలోనే నిర్బంధించారని తెలిపారు. ఢిల్లీ పోలీసులు తమకు పదేపదే ఫోన్ చేసి ఆందోళన ప్రణాళిక గురించి అడుగుతున్నారని అన్నారు. జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలపడమే తమ ఉద్దేశమని పలుమార్లు స్పష్టం చేసినా వారు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. విద్యార్థి సంఘాలు నిర్వహించే నిరసనలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లేదని, పోలీసుల ఆంక్షలే వారి దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తున్నాయని ఐషీఘోష్ పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం పౌరులకు కల్పించిందని, ఆ హక్కును కాలరాయాలనే ప్రయత్నాలే యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు. నిరసనలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం






కామెంట్‌లు (0)