Magazines

సీజేపీ నిరసనలో గుండెపోటుతో వ్యక్తి మృతి

20 గంటల క్రితం

Man dies of heart attack during CJP protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్‌ వద్ద చేపట్టిన సీజేపీ నిరసన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిరసనకు మద్దతుగా అక్కడికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని థానేలోని దోస్తి వెస్ట్‌ కౌంటీకి చెందిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లైగా గుర్తించారు. నిరసన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన శుక్రవారం సాయంత్రం శివాజీ పార్క్‌కు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే పోలీసులు ఆయనను శుశ్రూష ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోపాలకృష్ణ మృతి చెందినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్