Magazines

సెంచరీ దాటిన చమురు ధర

1 గంట క్రితం

Oil price crosses
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

వారంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4.9 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారల్‌కు సుమారు 110 డాలర్లు పలికింది. మే 19వ తేదీ తర్వాత బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. ఈ వారంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 4.9 శాతం పెరగడం గమనార్హం. హార్ముజ్‌ జలసంధి ని ఇరాన్‌ దిగ్బంధించడం, హౌతీల దాడుల కారణంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. రష్యాలోని అతి పెద్ద చమురు రిఫైనరీపై ఉక్రెయిన్‌ జరిపిన దాడితో సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. అక్కడ చమురు శుద్ధి నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా డీజిల్‌, ఇతర ఇంధనాలకు కొరత ఏర్పడింది. రష్యా ఇంధన దిగుమతులపై విధించిన సుంకాల విషయంలో అమెరి కా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడిప్పుడే మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. దాడులపై ఇరాన్‌ సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోందం టూ వస్తున్న వార్తలకు తోడు ఎర్ర సముద్ర తీరంలోఁ కీలకమైన సౌదీ అరేబియా ఓడరేవు యన్బూను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించడంతో చమురు క్షేత్రాలలో ఆందోళనలు పెరుగుతున్నాయి. గత పది రోజులుగా హార్ముజ్‌లో ఇరాన్‌ నౌకాదళ కార్యకలాపాలు పెరగడంతో జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్ల సంఖ్య బాగా తగ్గిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్