- ప్రజా వ్యవస్థను దిగ్బంధించడం సరికాదు
- మెట్రో, రైల్వే స్టేషన్ల మూసివేతను అంగీకరించలేం
- రైళ్లరద్దు , రహదారులపై ఆంక్షలు పున: పరిశీలించాలని ఆదేశం
- నిరసనలపై ఆంక్షలు నిషేధంతో సమానం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ పిటిషన్‌పై సుప్రీం అత్యవసర విచారణ కీలక ఆదేశాలు జారీ
దేశ రాజధానిలో హైటెన్షన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎస్ వంటి విద్యార్థి, డీవైఎఫ్ఐ, ఎఐవైఎఫ్ వంటి యువజన సంఘాలు తలపెట్టిన ఆందోళనను అణచి వేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిరసనకారులను అడ్డుకునేందుకు 57 మెట్రో స్టేషన్లతోపాటు న్యూఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసివేయడాన్ని అంగీకరించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వాటిని తెరవాలని ఆదేశించింది. అయితే, పరిమిత ఆంక్షలతో స్టేషన్లను తెరవాలని సూచించింది. స్టేషన్లను పూర్తిగా మూసివేయడం నియంత్రణ కాదని, అది నిషేధంతో సమానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైళ్ల రద్దు, రహదారులపై ఆంక్షలను పునఃపరిశీలించాలని ఆదేశించింది. ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు ముందు గానే తెలియజేయాలని పేర్కొంది. జంతర్‌మంతర్‌కు బదులుగా మరో నిరసన ప్రదేశాన్ని కేటాయించే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రత్యామ్నాయ నిరసన వేదిక కోసం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ అప్రజాస్వామ్య ఆంక్షలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇంటర్నెట్ నిలిపివేత సహా ఇతర ఆంక్షలను పునఃపరిశీలించే అవకాశం ఉందని న్యాయస్థానానికి స్పష్టం చేశారు. పరిస్థితులను సమీక్షించి, వీలైనంత త్వరగా సాధారణ స్థితిని తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
రామ్‌లీలా మైదాన్‌కూ అనుమతి లేదు..
జంతర్ మంతర్ ఒక నిర్దేశిత నిరసన ప్రదేశమని, దానికి అనుమతి ఇవ్వకపోగా రామ్‌లీలా మైదాన్‌ను కూడా తొలగించారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మంతర్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు, రామ్‌లీలా మైదాన్‌లో ప్రత్యామ్నాయం ఎందుకు ఇవ్వలేదని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ప్రశ్నించారు. న్యాయవాదుల వద్ద కార్లు ఉన్నందున రాకపోకలపై ఆంక్షలతో వారికి సమస్య ఉండకపోవచ్చని సీజేపీ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాది ఎన్.హరిహరన్ స్పందించారు. అంతా బారికేడ్లతో మూసివేశారని, కార్లు నడపడానికి రోడ్డు ఎక్కడ ఉందని అన్నారు.
మెట్రో స్టేషన్ల మూసివేత సరికాదు
శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ సొంత కార్లు ఉండవని, ప్రజా రవాణాపై ఆధారపడే పౌరులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఒక ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగిం చకూడదని వ్యాఖ్యానిస్తూ, నిరసనలను నియంత్రించే పేరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం నగరానికి వచ్చే వేలాది మంది సామాన్యుల పరిస్థితిపై తమకు ఆందోళన ఉందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
తాము సాధారణ ప్రజల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు.
ప్రజా రవాణాను నిలిపివేయడం తగదు
ఎం.ఎ బేబీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. కేరళం తదితర దూరప్రాంత రైళ్లు ఉదయం 11 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకుంటాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఏం చేయాలని ప్రశ్నించారు.
రైల్వే స్టేషన్లు, మెట్రో సేవలపై ఆంక్షలు విధించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వాదించింది. అయితే, ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. సీసీటీవీ నిఘా వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి శాంతిభద్రతలను కాపాడాలని సూచించింది. నిరసనలను అడ్డుకునేందుకు అన్ని మార్గాలను మూసివేయడం పరిష్కారం కాదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడటంతోపాటు సామాన్యుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఆంక్షలు విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొనకుండా వెనక్కి తగ్గాలని కోరుతూ మసీదులకు పోలీసులు వెళ్లిన ఘటనలపైనా తర్వాత పరిశీలన జరుపుతామని ధర్మాసనం తెలిపింది.పేర్కొన్నారు. దీంతో జంతర్






కామెంట్‌లు (0)