తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్
ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీలో ప్రమాదం
చెన్నై : ఆపిల్ ఐఫోన్ల కోసం విడిభాగాలను తయారు చేసే దక్షిణ భారతదేశంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ఊపిరాడక మరణించారు. తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్‌లో ఉన్న ఫ్యాక్టరీలో నీటి ట్యాంకుకు మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ విషయంపై టాటా ఎలక్ట్రానిక్స్ స్పందించలేదు. "ప్రతి కార్మికుడి భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషాద ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం," అని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి విరుదై మగల్ కీర్తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.







కామెంట్లు (0)