మనం కొత్త బూట్లు లేదా హ్యాండ్ బ్యాగులు కొన్నప్పుడు లోపల ఒక చిన్న తెల్లటి ప్యాకెట్ కనిపిస్తుంది. చాలామంది అది పనికిరాని వస్తువనుకుని పారేస్తుంటారు. కానీ, ఆ చిన్న ప్యాకెట్ లో ఉండే 'సిలికా జెల్' మీ ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి పాత ఫోటోల వరకు అన్నింటినీ రక్షించే ఒక కవచం. ఈ చిన్న ప్యాకెట్లను ఎలా రీ-యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
సిలికా జెల్ అనేది కేవలం గాలిలోని తేమను పీల్చుకోవడమే కాదు, వస్తువుల నిల్వ కాలాన్ని కూడా పెంచుతుంది. పౌడర్ మేకప్ ఉత్పత్తులు గడ్డకట్టకుండా ఉండాలన్నా, పాత పుస్తకాలు దుర్వాసన రాకుండా ఉండాలన్నా ఈ ప్యాకెట్లు ఉపయోగపడతాయి. మరి ఆ ఉపయోగాలు తెలుసుకుందాం..
సిలికా జెల్ వల్ల కలిగే ఉపయోగాలు
కెమెరా లెన్స్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు తేమ వల్ల పాడవకుండా వాటి బాక్సుల్లో ఈ ప్యాకెట్లను ఉంచండి.
వెండి ఆభరణాల డబ్బాలో ఒక ప్యాకెట్ ఉంచితే అవి త్వరగ నల్లబడకుండా ఉంటాయి.
మీ ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకాలు పాత ఫోటోలు తేమ వల్ల అతుక్కోకుండా రక్షిస్తాయి.
చెమట వాసన వచ్చే జిమ్ బ్యాగుల్లో వీటిని ఉంచడం వల్ల బ్యాగ్ తాజాగా ఉంటుంది.
లైబ్రరీ లేదా పాత పుస్తకాల అరల్లో ఉంచితే ఆ చెడు వాసన పోతుంది.
టూల్‌బాక్స్‌లో ఇవి ఉంటే మేకులు, పనిముట్లు తుప్పు పట్టవు.
వార్డ్‌రోబ్‌లో ఇవి ఉంచితే తేమ నుంచి కాపాడతాయి.
ముఖ్యమైన భద్రతా హెచ్చరిక
సిలికా జెల్ విషపూరితం కానప్పటికీ, దానిపై “DO NOT EAT” అని రాసి ఉంటుంది. ఎందుకంటే:
ఇది గొంతులో అడ్డుపడి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఇది శరీరంలోని తేమను విపరీతంగా పీల్చుకుని డీహైడ్రేషన్ కలిగిస్తుంది.
పిల్లలు, పెంపుడు జంతువులకు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉంచవద్దు.
చిన్న చిట్కా: ఈ ప్యాకెట్లు తేమను పీల్చుకుని బరువుగా మారినప్పుడు, వాటిని ఎండలో కొద్దిసేపు ఉంచితే మళ్ళీ కొత్త వాటిలా పనిచేస్తాయి.






కామెంట్‌లు (0)