మన శరీరానికి అవసరమైన రోజువారీ కేలరీలలో కొవ్వు లేదా నూనె పదార్థాల వాటా గరిష్టంగా 20% మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అది శరీరంలో అనవసర కొవ్వుగా పేరుకుపోయి కాలేయ సంబంధిత వ్యాధులకు (Fatty Liver) దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
లెక్కలు ఇలా ఉన్నాయి: సాధారణంగా మనం తెలియకుండానే రోజుకు 5 నుండి 6 చెంచాల నూనె లేదా నెయ్యిని ఆహారం ద్వారా తీసుకుంటున్నాం.
కొలత: ఒక చిన్న చెంచాలో సుమారు 5 గ్రాముల నూనె ఉంటుంది. అంటే రోజుకు 25 నుండి 30 గ్రాముల కొవ్వు మన శరీరంలోకి చేరుతోంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే పరిమితికి మించినదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కనిపించే, కనిపించని కొవ్వుల మధ్య తేడా : మనం కేవలం వంటల్లో పోపు వేయడానికి లేదా వేయించడానికి వాడే నూనెను మాత్రమే గమనిస్తాం. కానీ, మనం తినే అనేక ఆహార పదార్థాల్లో సహజంగానే కొవ్వు ఉంటుంది.
ప్రయోజనకరమైన కొవ్వులు: వేరుశనగ, బాదం, వాల్నట్స్ వంటి గింజల్లో శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన నూనెలు ఉంటాయి.
వాల్నట్స్ ప్రాముఖ్యత: వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, కృత్రిమంగా నూనెను జోడించడం కంటే ఇటువంటి గింజల ద్వారా అందే కొవ్వు ఉత్తమమైనది.
ఆలోచనలో మార్పు రావాలి
భారతీయ వంటకాల్లో నూనె, నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందనే అపోహ బలంగా ఉంది. అయితే, “ఎంత తక్కువ నూనె వాడితే, అంత ఎక్కువ ఆరోగ్యం” అనే సూత్రాన్ని మనం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కూరలు వండేటప్పుడు అదనంగా నూనెను కుమ్మరించడం వల్ల పోషకాలు నశించడమే కాకుండా, శరీరంలో కేలరీల భారం పెరుగుతుంది.
వంట పద్ధతులు: డీప్ ఫ్రైడ్ వంటకాల కంటే ఉడికించిన లేదా స్టీమ్ చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.
నూనె రకాలు: ఒకే రకమైన నూనెను వాడకుండా, నెలకు ఒకసారి వంట నూనెను మారుస్తూ ఉండటం మంచిది.






కామెంట్లు (0)