Magazines

వంటిల్లు ఇలా....

1 గంట క్రితం

kitchen
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

వంట గదిలో డైలీ వాడే పాత్రల్ని ఓ చోట, ఏదైనా సందర్భమో, కార్యక్రమమో ఉన్నప్పుడు వినియోగించేవి మరో చోట సెట్ చేసుకోవాలి. తద్వారా టైమ్ ఆదా అవ్వడమే కాకుండా కిచెన్​ నీట్​గా కనిపిస్తుంది. లేదంటే కనిపించిందల్లా తీసి వాడేస్తుంటే, అనవసరంగా ఎక్కువ పాత్రలు క్లీన్ చేయాల్సి వస్తుంది. పైగా కడిగాక వాటిని మళ్లీ సర్దుకోవడం కూడా ఇబ్బందే. అలాగే, వంటింటి నిత్యావసరాలు పప్పులు, మసాలా దినుసులు, నూనెలు, పాస్తాలు, సాస్‌లు, నట్స్‌ వంటి వాటిని పారదర్శకంగా ఉండే సీసాల్లో వేసుకోవాలి. అలాంటి సీసాలు లేకపోతే స్టీల్ బాక్సుల్లో వేసుకున్నా లేబులింగ్‌ చేసుకుంటే వెతక్కుండా అవసరానికి సులువుగా దొరుకుతాయి. కిచెన్​లో చాలా మంది కనిపించినవల్లా ఫ్రిజ్‌ల్లో కుక్కేస్తారు. అయితే రిఫ్రిజిరేటర్​ని​ అందంగా సర్దుకోవడవమూ ఓ కళ. మార్కెట్‌లో లభ్యమయ్యే ఫ్రిజ్‌ మ్యాట్స్‌ని అరల్లో వేసి ఆహార పదార్థాలు పెడితే మరకలు పడకుండా ఉంటాయి. అదేవిధంగా స్టోర్‌ బ్యాగ్‌లు, బాక్సుల్లో ఆహార పదార్థాలు సర్దితే ఈజీగా తీసుకోవచ్చు. పైగా పాడవకుండానూ ఉంటాయి. ఓ చిన్న బ్లాక్‌ బోర్డ్‌ లేదంటే వైట్‌ నోట్‌బుక్‌ వంటగదిలో ఏదో ఒక చోట వేలాడదీయండి. ఎప్పుడైనా సరకులు నిండుకుంటే వెంటనే అందులో నమోదు చేయండి. లేదా అక్కడి అవసరాలను తర్వాత గుర్తు చేసుకోవాలనుకున్నా దానిలో రాసుకోండి. ఇక్కడే గ్యాస్‌ తెచ్చిన తేదీ, వాటర్‌ ఫిల్టర్‌ మార్చిన డేట్‌ ఇలా చాలా విషయాలను రాసుకోవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్