Magazines

‘నైనీ’ నుంచి వైటీపీఎస్‌కు 
రోజుకు 16 వేల టన్నుల బొగ్గు

42 నిమిషాల క్రితం

16,000 tonnes of coal daily from ‘Naini’ to YTPS
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

క్షేత్ర స్థాయిలో పర్యటించిన జెన్కో, 
సింగరేణి అధికారులు​
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఒడిశాలోని నైని బొగ్గు గనుల నుంచి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు(‌వైటీపీఎస్‌) ప్రతీ రోజూ 16 వేల టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు టీజీజెన్కో, సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా చర్యలు చేపట్టింది. బొగ్గు సరఫరాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో బాగంగా టీజీజెన్కో ఎమ్‌‌డీ ఎస్‌.హరీశ్‌, సింగరేణి డైరెక్టర్‌ ‌బి.నాగ్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం సోమవారం ఒడిశాలోని నైని బొగ్గు గనులను సందర్శించారు. రవాణా అడ్డంకులను తొలగించి వైటీపీఎస్‌కు రోజువారీ బొగ్గు సరఫరాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో వారు చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. వైటీపీఎస్‌‌లోని సూపర్ క్రిటికల్ యూనిట్ల సమర్థవంతమైన కార్యకలాపాలకు నైని బ్లాక్ నుండి వచ్చే బొగ్గు చాలా అవసరం. ఎల్‌‌నినో పరిస్థితుల్లో పెరుగుతున్న విద్యుత్‌ ‌డిమాండ్‌‌ను తట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యల్లో బాగంగా సర్కార్‌ ‌బొగ్గు సరఫరా పెంపుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇరు సంస్థలకు చెందిన అధికారులు సోమవారం ఉమ్మడిగా నైనీ బొగ్గు బ్లాకును సందర్శించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్