Magazines

చుక్కా రామయ్య జీవితంపై డాక్యుమెంటరీ

1 గంట క్రితం

Chukka Ramaiah
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

కిన్నెర చిత్ర పతాకంపై చిత్రీకరణ ప్రారంభం

ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి.రమణ హాజరు

నవతెలంగాణ–కల్చరల్

​మాజీ ఎమ్మెల్సీ, ప్రఖ్యాత విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధి పొందిన చుక్కా రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌‌ విద్యానగర్‌‌లోని ఆయన నివాస కార్యాలయంలో ప్రారంభమైంది. కిన్నెర చిత్ర పతాకంపై ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణ మాట్లాడుతూ.. నిబద్ధత, అంకితభావంతో ఏడు దశాబ్దాలకు పైగా విద్యాబోధన చేసిన చుక్కా రామయ్య ఎందరో శాస్త్రవేత్తలను దేశానికి అందించారని కొనియాడారు. కేవలం ఐఐటీ ర్యాంకులే లక్ష్యంగా విద్యాబోధన చేయకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించిన సామాజిక తత్వవేత్త అని చెప్పారు. కిన్నెర చిత్ర నిర్మాత రఘురాం మాట్లాడుతూ.. 102 ఏండ్ల వయసులోనూ చుక్కా రామయ్య నేటి విద్యావ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఆయన జీవిత కథను డాక్యుమెంటరీగా రూపొందించేందుకు అంగీకరించిన రామయ్యకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ సహకారం అందిస్తున్న బీడీఎల్‌ సత్యనారాయణ, దర్శకుడు పి.వి. చలం, ఛాయాగ్రాహకుడు విజయకుమార్‌, కిన్నెర సభ్యులు రాధాకృష్ణ, సుబ్బారావు, చుక్కా రామయ్య కుమారుడు అచ్యుత్‌ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్