Magazines

మహాసభలో ఉద్యమ కార్యాచరణ

1 గంట క్రితం

Action Plan for the Movement at the General Assembly
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 3 నిమిషాల చదవడం

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

నవంబర్‌ 15న నల్లగొండలో 15 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతు

​90 ఏండ్ల వీరోచిత పోరాటాల

వారసత్వంతో ఐక్య పోరాటాలు

పేద రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి : తెలంగాణ

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్

రైతుల పాలిట మరణ శాసనాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ విధానం, విద్యుత్ సవరణ బిల్లులు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని సుదర్శన్ విమర్శించారు. ఉచిత విద్యుత్ హక్కును తొలగించి విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు నష్టం కలిగించే విద్యుత్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు సమగ్ర రక్షణ కల్పించేలా వ్యవసాయ బీమా చట్టంలో మార్పులు చేసి, రాష్ట్రాల హక్కులను కాపాడాలని కోరారు.

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండలో అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభ లను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించబోతున్నా మని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. నవంబర్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న మహాసభల వివరా లను ఆయన బుధవారం ఖమ్మంలోని సుంద రయ్య భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఖమ్మం జిల్లాలో 26వ మహాసభలు జరిగాయని అన్నారు. 37 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతీయ మహాసభలు జరగడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. నవంబర్ 15న మహాసభల ప్రారంభం సందర్భంగా 15 వేల మంది రెడ్‌షర్ట్ వాలంటీర్లతో భారీ ప్రదర్శన, కవాతు నిర్వహిస్తామని, లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

​మహాసభల్లో పోరాట కార్యాచరణ

​​భారత వ్యవసాయ రంగం, రైతాంగ భవిష్యత్తుపై లోతైన చర్చలు జరిపి, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలను బలోపేతం చేసే కార్యాచరణను మహాసభలో రూపొందిస్తామని పోతినేని తెలి పారు. ముఖ్యంగా వృద్ధాప్య పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు జీవించడానికి ఎటువంటి ఆధారమూ లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవడానికి నెలకు రూ. 10,000 పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిం చేలా చట్టబద్ధమైనహామీతో కూడిన ‘కనీస మద్దతు ధరల చట్టం’ తీసుకురావాలని స్పష్టం చేశారు.

90 ఏండ్ల వీరోచిత పోరాటాల చరిత్ర

​​అఖిల భారత రైతు సంఘం ఆవిర్భవించి దాదాపు 90 ఏండ్ల పూర్తి కావస్తోందని, దేశ స్వాతంత్ర్యం, రైతాంగ హక్కులు, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం చారిత్రాత్మక ఉద్యమాలు నడిపిన ఘనత ఈ సంఘానికే దక్కుతుందని పోతినేని సుదర్శన్ చెప్పారు. 1936లో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనాకాలంలో పురుడు పోసుకున్న ఈ సంఘం, జాతీయ స్వాతంత్ర్య ఉద్యమ వారసత్వంలో భాగస్వామిగా నిలిచిం దన్నారు.1946వ సంవత్సరంలో ‘దున్నేవాడికే భూమి కావాలి’, ‘వెట్టిచాకిరి రద్దు కావాలి’ అనే ప్రధాన డిమాండ్లతో రూపుదిద్దుకున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఈ ఏడాదితో 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 80వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నట్టు తెలిపారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పోతినేని సుదర్శన్ విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి హామీలను తుంగలో తొక్కిందన్నారు. 2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 440 రైతు సంఘాలను ఏకం చేసి, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు పోరాడిన ఘనత ఏఐకేఎస్‌కు ఉందని తెలిపారు. విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ఒప్పందాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

​కనీస మద్దతు ధరల నిర్ణయంలో తీవ్ర అన్యాయం

సాగు ఖర్చులు పెరుగుతున్నా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సుదర్శన్ విమర్శిం చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మొక్కజొన్న మద్దతు ధరను కేవలం రూ.10 మాత్రమే పెంచడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపో తున్నారని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వర రావు, బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్