Magazines

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

55 నిమిషాల క్రితం

as TRS MLC candidate
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ రక్షణ సేన వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ ముహూర్తాన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ ను కవిత ఖరారు చేశారు. ఈ ఎన్నికల కో ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్ గా సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ను నియమించారు. ఉమ్మడి వరంగల్ (ప్రస్తుత మహబూబాబాద్) జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవి పల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కాకతీయ యునివర్సిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి కల్వకుంట్ల కవిత వెన్నంటి నడిచారు పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చానెళ్ల డిబేట్లలో, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ గొంతుకగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి శాసన మండలి ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులను కవిత రంగంలోకి దించుతుండటం గమనార్హం. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే మొదటి అభ్యర్థిగా అధికారికంగా శ్రీకాంత్ గౌడ్ పేరు ప్రకటించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్