Magazines

లక్ష ఎకరాలకు సాగునీరు

56 నిమిషాల క్రితం

Irrigation water for one lakh acres
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ లోకి నీరు విడుదల

బీఆర్ఎస్ నాయకులకు ఇంగిత జ్ఞానం లేదు : మంత్రి జూపల్లి

నవతెలంగాణ- నాగర్‌‌కర్నూల్‌

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌ నుంచి 1000 క్యూసెక్కుల ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుందని వివరించారు. నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం సహా కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అవి పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌ సహా బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మంత్రి అన్నారు. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్