మంత్రులకు కూటమి నేతల విజ్ఞప్తి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రీయను వెంటనే ప్రారంభించాలని కూటమి నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పలు వురు మంత్రులను కలిశారు. తెలంగాణ వర్కర్స్ యూని యన్(టీడబ్ల్యూయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడ రేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) బంజారాహిల్స్‌లో ఉన్న మంత్రుల క్వార్టర్లల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని కోరారు. అలాగే రిటైరైన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు, ఉద్యోగ విరమణ చేసిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ నేతల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రిటైరైన ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనీ, వారికి గతంలో రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించే అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రులను కలిసినవారిలో కూటమి నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి, వి.ఎస్. రావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)