Magazines

బార్‌‌ అండ్‌
రెస్టారెంట్లు బంద్‌

1 గంట క్రితం

Bars and restaurants closed.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

​ప్రివిలేజ్‌ ఫీజు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
​రాష్ర్టంలో బార్‌ అండ్‌ ‌రెస్టారెంట్లు సోమవారం నుంచి బంద్‌ ‌చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర రెస్టారెంట్‌, బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. బార్‌ అండ్‌ ‌రెస్టారెంట్ల నుంచి ప్రివిలేజ్‌ ఫీజును 8 నుంచి 20 శాతానికి పెంచడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అసోసియేషన్‌ అధ్యక్షులు దామోదర్‌‌గౌడ్‌ ‌తెలిపారు. ఇప్పటికే లైసెన్సు ఫీజుల పేరుతో ఏటా రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు చెల్లిస్తున్నామనీ, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ప్రివిలేజ్‌ ఫీజు వల్ల ఒక్కో బార్‌పై అదనంగా మరో రూ.30 లక్షల వరకు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల బార్‌ అండ్‌ ‌రెస్టారెంట్లు రెన్యువల్‌ ‌చేసుకున్నాక లైసెన్స్‌ ‌ఫీజును ఒకేసారి రూ.4 లక్షలు పెంచారని తెలిపారు. దీనిపై ఎక్సైజ్‌‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో బంద్‌‌కు వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాష్ర్టంలోని 1200కు పైగా ఉన్న బార్‌ అండ్‌ ‌రెస్టారెంట్లు ఈ బంద్‌‌లో పాల్గొంటాయని తెలిపారు. నిరవధికంగా సాగే ఈ బంద్‌తో ప్రభుత్వం స్పందించకుంటే, భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్