Magazines

అధ్వానంగా ప్రభుత్వాస్పత్రులు

42 నిమిషాల క్రితం

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శ

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లోని ఎస్ఎన్ సీయూలో సీలింగ్ కూలిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రయివేటు బస్సు బోల్తా పడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందనీ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలనీ, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్